Posts

బద్దం ఎల్లారెడ్డి వెట్టి విముక్తి ప్రదాత.

మట్టి మనుషుల గుండె చప్పుడు.. నిబద్ధత గల నేత.. బద్దం ఎల్లారెడ్డి ఒకసారి ఎంపీ.. రెండుసార్లు ఎమ్మెల్యేగా.. సాయుధ పోరాట యోధుడు.. భూస్వామిగా పుట్టి.. పేదలకు సొంత భూమిని పంచిన నేత.. నిజాం నిరంకుశ పదఘట్టనలు.. వెట్టిచాకిరి బతుకులు.. బాంచెన్‌ దొర.. నీ కాల్మొక్త దొర అంటూ.. తలదించుకుని.. బతికే కాలం.. మట్టి మనుషుల్లో పోరాట స్ఫూర్తిని నింపిన అగ్నికణం.. బద్దం ఎల్లారెడ్డి. తాడిత, పీడిత ప్రజలను ఏకం చేసి వ్యవసాయ పని ముట్లను ఆయుధంగా మలిచి బానిసత్వం తిరుగుబాటు బావుటా ఎల్లారెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి నిఖార్సయిన పోరాట యోధుడు. 1951లో జరిగిన తొలి ఎన్నికల్లోనే పీడీఎఫ్‌ అభ్యర్థిగా కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బద్దం ఎల్లారెడ్డి విజయం సాధించారు. సొంత భూమిని పేదలకు పంచిన మానవతావాది. ఒక్కసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బద్దం ఎల్లారెడ్డి తుదిశ్వాస విడిచేవరకు అట్టడుగువర్గాల మేలుకోరిన ప్రజానేత. యువ కెరటం.. అరుణ పతాకం.. గాలిపెల్లికి చెందిన బద్దం హన్మంతరెడ్డి-లచ్చవ్వల రెండో సంతానంగా 1906లో జన్మించిన బద్దం ఎల్లారెడ్డి యుక్త
Recent posts